కూర్మనాథని సేవలో ఎమ్మెల్యే
SKLM: గార మండలం శ్రీకూర్మంలో వెలసిన శ్రీ కూర్మనాథ స్వామి వారిని కుటుంబ సమేతంగా నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.