నన్ను ఎవరు అడ్డుకుంటారో చూస్తా: బండి సంజయ్
TG: బోరబండ సభపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. 'రోడ్ షోకు అనుమతి కోరలేదనడం సరైంది కాదు. అనుమతి కోరుతూ పోలీసులకు లేఖ ఇచ్చాను. బోరబండకు నేనొస్తున్నా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా. బీజేపీ కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలి. సాయంత్రం BJP దమ్మేంటో చూపిద్దాం' అని పేర్కొన్నారు. మరోవైపు పంజాగుట్ట ACP పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆయనపై BJP.. ఈసీకి ఫిర్యాదు చేసింది.