'హంద్రీనీవాపై అసత్యాలు మానుకోవాలి'

CTR: హంద్రీనీవా జలాలపై వైసీపీ ఎమ్మెల్సీ భరత్ అసత్యాలు మాట్లాడటం మానుకోవాలని మాజీ ఏఎంసీ ఛైర్మన్ సత్యేంద్ర శేఖర్ పేర్కొన్నారు. వైసీపీ హయంలో సినిమా స్టంటును తలపించే విధంగా మభ్యపెట్టారని అన్నారు. అపర భగీరధుడుగా సీఎం చంద్రబాబు కుప్పానికి కృష్ణా జలాలను తీసుకువచ్చారన్నారు. హంద్రీనీవాపై తప్పుడు ప్రచారాలు చేస్తే భరత్‌ను గ్రామాల్లో తిరగనివ్వమంటూ ఆయన హెచ్చరించారు.