ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఇంఛార్జి కలెక్టర్

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఇంఛార్జి కలెక్టర్

SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పల్లె దవాఖానలో ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ రిజిస్టర్, మందులు ఇచ్చే గది, వ్యాక్సిన్లు, మందుల స్టోర్ రూంలో పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ మొత్తం శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. వైద్యానికి వచ్చిన పలువురు రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు.