అమ్మవారి 18 రోజుల హుండీ ఆదాయం ఎంతంటే..?
NTR: ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో 18 రోజులకు సంబంధించిన హుండీ కానుకలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. భక్తులు సమర్పించిన నగదు రూ. 3,35,86,637లుగా నమోదైంది. 302 గ్రాముల బంగారం, 3 కిలోల 10 గ్రాముల వెండి లభించాయి. రోజుకు సగటు ఆదాయం రూ.18,65,924లుగా ఉందని అధికారులు తెలిపారు.