మద్యానికి బానిసై ఉరి వేసుకుని ఆత్మహత్య

NRML: మద్యానికి బానిసై ఒకరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన భైంసా మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కథనం మేరకు మహాగాం గ్రామానికి చెందిన కదం బాలాజీ (48) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు.. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది తన సోదరుడి పంట చేనులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు