పెదనందిపాడులో రైతన్న మీకోసం కార్యక్రమం
GNTR: పెడనందిపాడు మండలంలోని గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహనరావు, మండల వ్యవసాయ అధికారి ఐ. సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. రైతులు పంచ సూత్రాలు పాటించాలని సూచించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్‌పై అవగాహన కల్పించారు. రైతులు నమోదు చేసుకుని యాప్ వినియోగించాలని తెలిపారు.