రైలులో పర్స్ చోరీ.. అద్దాలు పగలకొట్టిన మహిళ
ఇండోర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రైల్లో చిన్న బిడ్డతో ప్రయాణిస్తున్న ఓ మహిళ పర్స్ చోరీకి గురైంది. ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహంతో ఆమె రైలు విండో గ్లాస్‌ను పగలగొట్టారు. ఈ వీడియో వైరల్ కాగా.. అధికారులు బాధితులను ఎందుకు పట్టించుకోరని కొందరు ప్రశ్నిస్తుండగా, రైల్వే ఆస్తి నష్టం చేయడం సరికాదని మరికొందరు విమర్శిస్తున్నారు.