రోడ్లను ధ్వంసం చేస్తున్న కేజ్ వీల్ ట్రాక్టర్లు...!

MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్, కొత్తపేట్, రోడ్లను ధ్వంసం చేస్తున్న కేజ్ వీల్ ట్రాక్టర్లు. అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా డ్రైవర్లు రోడ్డుపై కేజ్ వీల్ ట్రాక్టర్‌లను నడుపుతున్నారు. దీంతో రోడ్లు మరింత అధ్వాన్నంగా తయారవుతున్నాయి. రోడ్డుపై కేజ్ వీల్ ట్రాక్టర్‌తో నడిపిన డ్రైవర్లపై ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.