పెద్దఅంబర్ పేట్ ORRపై కారులో సజీవ దహనం

RR: అబ్దుల్లాపూర్‌మెట్ పెద్దఅంబర్‌పేట్ ORRపై యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని కారు ఢీకొనడంతో మంటలు వచ్చి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కాగా.. కారులో ఉన్న ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మరొకరిని స్థానికులు కాపాడారు. పెద్దఅంబర్ పేట్ నుంచి ఘట్‌కేసర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.