విద్యుత్ తీగలు తగిలి వేటగాడికి తీవ్రగాయాలు

MLG: ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి అడవుల్లో అటవీ జంతులను వేటాడడం కోసం శనివారం మండల కేంద్రానికి చెందిన తుమ్మ గంగయ్య అనే వేటగాడు విద్యుత్ తీగలు అమర్చుతుండగా తీగలు తగిలి గాయపడ్డాడు. ఈ విషయం తెలిసి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని అడవిలో సుమారు రెండు కిలోమీటర్ల దూరం మోసుకువచ్చి 108లో ఆసుపత్రికి తరలించారు.