కోతుల బెడదతో ప్రజల ఇక్కట్లు
ఆసిఫాబాద్‌లో కోతుల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతులు గుంపులుగా తిరుగుతూ ఇళ్లపైకి ఎక్కి ఆహార పదార్థాలను దొంగిలించడం, ఇంటి వద్ద ఆడుతున్న చిన్నపిల్లలను భయపెట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. రోజురోజుకీ కోతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.