ఎరువుల కృత్రిమ కొరత సృష్టించరాదు: ఎస్పీ
BPT: ఎరువుల కృత్రిమ కొరత సృష్టించే వారిని ఉపేక్షించబోమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుషార్ డూడి మంగళవారం హెచ్చరించారు. ఎవరూ ఎరువుల కృత్రిమ కొరత సృష్టించరాదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతులకు విక్రయించాలన్నారు. స్టాక్ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. స్టాక్ రిజిస్టర్ ప్రకారమే దుకాణాల్లో ఎరువులు ఉండాలన్నారు.