'విద్యార్థులు శిక్షణ సూత్రాలు జీవితంలో అలవర్చుకోవాలి'
NZB: ఎడపల్లి మండలం జానకంపేటలో ఉన్న కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్‌లో పది రోజులుగా కొనసాగిన ఎన్‌సీసీ క్యాంప్ వేడుకలు గురువారంతో ముగిశాయి. క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రియజిత్ సుర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ అకాడమిక్‌లో సైతం ఉన్నతంగా రాణిస్తూ దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వం కలిగి ఉండాలన్నారు.