శనేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

శనేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

NGKL: నంది వడ్డెమాన్ గ్రామంలోని శ్రీ నందీశ్వర శనేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు మార్చి 31 నుంచి ఏప్రిల్ 2, 2026 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూజలు, హోమాలు, కళ్యాణ మహోత్సవం వంటి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు పేర్కొన్నారు.