భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు పూర్తిగా ఆగిన వరద ఉధృతి

ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు గత వారం రోజులుగా కొనసాగిన వరద ఉధృతి సోమవారం పూర్తిగా ఆగిపోయిందని జల వనరుల శాఖ ఏఈ హరీష్ తెలిపారు. భైరవాణి తిప్ప ప్రాజెక్టు పూర్తి నీరు నిలువ సామర్థ్యం 1655 అడుగులు కాగా ప్రస్తుతం 1651.8 అడుగుల వద్దకు వరకు నీరు చేరిందన్నారు.