ప్రకృతి ఆధారిత వ్యవసాయానికి ప్రాధాన్యం అవసరం
విశాఖపట్నంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా జెవి రత్నం మాట్లాడుతూ.. ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం, రసాయనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. పర్యావరణాన్ని రక్షిస్తేనే జీవరాశి నిలుస్తుందని తెలిపారు.