రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ప్రకాశం: టంగుటూరు 16వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో అరుణ్ చంద్ అనే యువకుడు మృతి చెందాడు. వ్యక్తిగత పనులపై వల్లూరు వెళ్లి తిరిగి వస్తున్న అరుణ్ చంద్, తన ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.