అల్లూరు మండలంలో జోరు వర్షం

అల్లూరు మండలంలో జోరు వర్షం

NLR: అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలోని మబ్బులన్నీ పూర్తిగా నల్లగా మారిపోయాయి. రాత్రి ఎనిమిది గంటల 40 నిమిషాల ప్రాంతం నుంచి మండలంలోని మందిరం, ఇందుపూరు, తుఫాన్ నగర్ తదితర ప్రాంతాల్లో మోస్తారుగా వర్షం కురిసింది. వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది.