డిసెంబర్ 13న లోక్ అదాలత్
CTR: రాజీ మార్గమే రాజా మార్గం అని DSLA సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. డిసెంబర్ 13న లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరు వర్గాల వారికి కౌన్సెలింగ్ అందించి, వారి రాజీతో కేసులను ముగిస్తాం అని, ఈ కేసులకు అప్పీలు ఉండవని, కోర్టు సమయంతో పాటు కక్షిదారుల సమయాన్ని కూడా ఆదా అవుతుందని తెలిపారు.