'హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం'
HYD: దివ్యాంగులకు 100 రోజుల్లోనే రూ.6వేల పెన్షన్ అని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో వివరంగా ఇచ్చిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులకు రూ. 6 వేల పెన్షన్ ఎందుకు ఇంకా ఇవ్వట్లేదని శాసనసభలో ప్రశ్నిస్తామన్నారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని పేర్కొన్నారు.