ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
MDK: చేగుంటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మకాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ వెంగళరావు, సర్పంచ్ స్రవంతి సతీష్, ఉప సర్పంచ్ రఫీ, మండల పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ పాల్గొన్నారు.