'కక్ష సాధింపు చర్యలు చేపట్టడం దారుణం'

NRML: నిజాలను నిక్కచ్చిగా రాస్తున్న మీడియాపై ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలు చేపట్టడం దారుణమని నిర్మల్ పాత్రికేయులు అన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై పోలీసుల దాడిని నిరసిస్తూ శుక్రవారం వివిధ పాత్రికేయ సంఘాలు, నిర్మల్ పాత్రికేయులు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవకు వినతి పత్రాన్ని అందజేశారు. శ్రీధర్, అల్లం అశోక్, భూమేష్, రామ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.