VIDEO: బస్టాండ్‌లో తాగునీటి సమస్య తీవ్రం

VIDEO: బస్టాండ్‌లో తాగునీటి సమస్య తీవ్రం

BHPL: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ఎండలు ముదురుతుండటంతో మంచినీళ్లు లేక అల్లాడిపోతున్నారు. బస్టాండ్‌లోని తాగునీటి కుళాయిలు పాడైపోయి నిరుపయోగంగా మారాయి. వెంటనే RTC అధికారులు స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.