నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అవసరం: ఎమ్మెల్యే
MDCL: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చర్లపల్లి డివిజన్ భగవాన్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు ఆధునిక సాంకేతికత ఎంతో అవసరమని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు.