VIDEO: ఎంపీడీవో ఆఫీస్ ముందు బీజేపీ నాయకుల ధర్నా

KNR: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రాజీవ్ యువ వికాసం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తపల్లి మండలం ఎంపీడీవో ఆఫీస్ ముందు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో యువకులను మోసం చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాస్, ఆసరా పెన్షన్లు వెంటనే అమలుపరచాలని ధర్నా నిర్వహించారు