VIDEO: 'ఫీజు బకాయిలు చెల్లించే వరకు బంద్ కొనసాగిస్తాం'
MNCL: బెల్లంపల్లి పట్టణంలోని భవిత డిగ్రీ కళాశాల ఎదుట సోమవారం కళాశాల సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల నిర్వహించలేని స్థితిలో చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు బకాయిలు చెల్లించాలని లేనిపక్షంలో నిరవధిక బంద్ కొనసాగిస్తామన్నారు.