తండ్రి కల సాకారం చేసిన కొడుకులు
GNTR: తెనాలి మండూరుకి చెందిన నరసింహారావు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు కొడుకులను పోలీస్, డాక్టర్‌గా చూడాలన్న కలతో ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కొడుకు కోమల్ కానిస్టేబుల్ ఫలితాలలో ప్రకాశం జిల్లాలో 58ర్యాంక్ సాధించి సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. 2వ కొడుకు సందీప్ ఉన్నత ర్యాంకుతో మంగళగిరి ఎయిమ్స్‌లో ఎనస్థీషియా పీజీ చేయబోతున్నాడు.