టేకులపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెండ్
BDK: టేకులపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి ఉప్పు దీప్తిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పంచాయతీలో ప్రోటోకాల్ పాటించడం లేదని గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ బాలు MPDO, కలెక్టర్ అంకిత్, DPOకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేపట్టి ఈ మేరకు కలెక్టర్ అంకిత్ నివేదిక అందజేయగా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ DPO ఉత్తర్వులు జారీ చేశారు.