కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ముందస్తు అరెస్టు

HNK: గవర్నర్ విష్ణు దేవ్ వర్మ పర్యటన సందర్భంగా సోమవారం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను ముందస్తు అరెస్టు చేశారు. యూనివర్సిటీ మొదటి, రెండో గేటు ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. బయటి వారిని ఎవరిని లోపలికి రానివ్వడం లేదు. గవర్నర్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు సైతం అడ్డుకుంటామని చెప్పడంతో, ఎప్పుడు ఎవరూ ఆందోళన చేస్తారోనని పోలీసులకు టెన్షన్ నెలకొంది.