ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

వరంగల్ జిల్లా: నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ముదిరాజ్ కులస్థులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లు ముదిరాజ్కులస్థులు తెలిపారు.