కౌలు రైతులకు గుర్తింపు కార్డులు

SKLM: బూర్జ మండలంలోని 103 మంది కౌలు రైతులకు కౌలు గుర్తింపు కార్డులను మంజూరు చేయడం జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి డి.ఉషారాణి తెలిపారు. కౌలు రైతులకు ఇప్పటికే ఈ క్రాఫ్ట్ నమోదు, రెండవ విడత అన్నదాత సుఖీభవ పథకం నిధులను ప్రభుత్వం విడుదల చేసినప్పుడు గుర్తింపు కార్డు కలిగి ఉన్న కౌలు రైతులందరికీ రెండు దపాలుగా రూ.20 వేలు చొప్పున మంజూరు అవుతాయని తెలిపారు.