లింగయ్యపాలెంలో ట్రాక్టర్ చోరీ

లింగయ్యపాలెంలో ట్రాక్టర్ చోరీ

GNT: తుళ్లూరు మండలం లింగయ్యపాలెం గ్రామంలో ట్రాక్టర్ చోరీకి గురైన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం..లింగాయపాలెంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద నిలిపిన తన ట్రాక్టర్ చోరీకి గురైందని గ్రామానికి చెందిన గెత్తం శేఖర్ తుళ్లూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారని తెలిపారు. ఘటనపై  కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.