కలెక్టర్ చొరవతో స్వగ్రామంకి చేరిన మహిళ
కోనసీమ: ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి కి చెందిన విజయలక్ష్మి ఖతార్‌లో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చొరవతో బుధవారం సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. 2025లో ఖరార్ వెళ్ళిన ఆమె అనారోగ్యం కారణంగా అక్కడ పని చేయలేక అవస్థలు పడ్డారు. 'కోనసీమ సెంటర్ ఫర్ మేగ్రేషన్' ద్వారా కలెక్టర్‌ను ఆశ్రయించడంతో ఆమెకు విముక్తి లభించింది.