'భూభారతి చట్టంతో శాశ్వత పరిష్కారం'

'భూభారతి చట్టంతో శాశ్వత పరిష్కారం'

SRPT: భూభారతి చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చేయనున్నట్లు కలెక్టర్ తేజస్ శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా సాదా దస్తావేజు భూములను రెగ్యులరైజేషన్ చేసి అర్హులైన రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాలు జారీ చేస్తామన్నారు. సోమవారం నుంచి నూతనకల్, మద్దిరాల మండలాల్లో పైలెట్ పద్ధతిన దీర్ఘకాల భూసమస్యలను పరిష్కరించేందుకు షెడ్యూల్ జారీ చేస్తామని పేర్కొన్నారు.