నేడు బేతంచెర్లలో టీడీపీ కార్యకర్తల సమావేశం
NDL: బేతంచెర్ల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 గంటలకు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకుడు ఎల్ల నాగయ్య తెలిపారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కావున మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.