స్వామివారికి సొరకాయలు విరాళం

CTR: శ్రీకాళహస్తీస్వర స్వామివారికి శనివారం హైదరాబాదుకు చెందిన మురళి అనే భక్తుడు తాను ప్రకృతి వ్యవసాయంతో పండించిన 1116 కేజీల సొరకాయలు విరాళంగా ఇచ్చారు. ఆలయ అధికారులు ఆయన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మూర్తి, అధికారులు పాల్గొన్నారు.