మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ ప్రకటన
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 296 స్థానాలకు 1906 అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తెలిపారు. అసోంలో 126 స్థానాలకు 722 మంది అభ్యర్థులు, కేరళంలో 140 స్థానాలకు 890 మంది, పుదుచ్చేరిలో 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 9న అసోం, కేరళం, పుదుచ్చేరిలో పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.