కల్వకుర్తిలో ఎస్ఐసీ వార్షికోత్సవం

NGKL: కల్వకుర్తిలోని జీవిత బీమా కార్యాలయంలో ఎల్ఐసీ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ భాస్కర్ రెడ్డి, ఏడీఎం చంద్రశేఖర్, యూనియన్ అధ్యక్షులు రామ్ గోపాల్ రెడ్డి, కార్యదర్శి సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.