ఎల్లంపల్లితోనే హైదారాబాద్‌కు గోదావరి జలాలు: మంత్రి

KNR: ఎల్లంపల్లితోనే హైదారాబాద్‌కు గోదావరి జలాలు తీసుకువస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో HYDకి మంజీరా, కృష్టా నీటని కూడా మేమే తెచ్చామని గుర్తుచేశారు. BRS పదేళ్లలో 1 MGD నీటిని కూడా తేలేకపోయిందని విమర్శించారు. BRS చేయలేని పనులు మా ప్రభుత్వం చేస్తుందన్నారు. హైదరాబాద్‌కి తాగునీటి సమస్య లేకుండా చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.