'పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలి'
NLG: గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ లక్ష్మీనారాయణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. నల్గొండలో ఇవాళ కార్మికులతో కలిసి వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఛలో హైదరాబాద్‌కి వెళ్లకుండా చేసిన అక్రమ అరెస్టులను ఖండించారు.