VIDEO: విద్యార్థిపై గంజాయి బ్యాచ్ దాడి
అన్నమయ్య: రాయచోటిలో ఇంజనీరింగ్ విద్యార్థి లతీష్ కుమార్‌పై గంజాయి మత్తులో ఉన్న గ్యాంగ్ దాడి చేసింది. మంగళ కాలనీ సమీపంలో క్రికెట్ ఆడుతున్న లతీష్‌పై రాడ్లు, కత్తులు, బీరు బాటిళ్లతో ఓ గ్యాంగ్ దాడికి పాల్పడారు. ఈ ఘటనలో లతీష్ తీవ్రంగా గాయపడటంతో.. స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా ఈ గ్యాంగ్ పలు దాడులకు పాల్పడినట్లు వారు తెలిపారు.