OFFICIAL: 'ఫంకీ' రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, దర్శకుడు అనుదీప్ కాంబోలో 'ఫంకీ' మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. 2026 ఏప్రిల్ 3న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.