గణేశ్ నవరాత్రులు శాంతియుతంగా జరుపుకోవాలి: SP

గణేశ్ నవరాత్రులు శాంతియుతంగా జరుపుకోవాలి: SP

BHPL: జిల్లా ప్రజలు గణేశ్ నవరాత్రులను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ కిరణ్ కారే శుక్రవారం సూచించారు. మండపాల నిర్వాహకులు భద్రత, బందోబస్తు కోసం తప్పనిసరిగా https://policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ దరఖాస్తు ద్వారా మండపాల ఏర్పాటు, ఊరేగింపులకు అనుమతి పొందవచ్చని, పూర్తి వివరాలు లభిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.