ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు
ఇరాన్‌లో భారీ దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 12 గంటల పాటు రైలు ప్రయాణాలకు, రైలు మార్గాలకు సమీపంలో ఉండే ప్రజలు అక్కడినుంచి దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. 'ఒకవేళ మీరు అక్కడ ఉంటే.. అది మీ ప్రాణాలకు ప్రమాదం కావొచ్చు' అని తెలిపింది. దీన్ని అత్యవసర హెచ్చరికగా పేర్కొంది.