100 స్థానాల్లో విజయం సాధిస్తాం: రాహుల్
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(UDF) విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. 100కుపైగా స్థానాల్లో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ క్రమంలో UDF కూటమికి బ్రహ్మరథం పడతారని చెప్పారు. అధికార LDF ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని UDF అధికారంలోకి రావటాన్ని ఎవరూ ఆపలేరన్నారు.