'ఐవీఆర్ఎస్ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'

'ఐవీఆర్ఎస్ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'

ప్రకాశం: కశింకోట మండలంలో ఐవీఆర్ఎస్ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీవో చంద్రశేఖర్ ఆదేశించారు. ఈ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శానిటేషన్, క్లోరినేషన్, తాగునీరు తదితర అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.