శ్రీశైలంలో 1782 మందితో భారీ బందోబస్తు: ఎస్పీ
NDL: శ్రీశైలం క్షేత్రంలో 1,782 మంది సిబ్బందితో బ్రహ్మోత్సవాల ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సునీల్ తెలిపారు. నంద్యాలలో ఏఎస్పీ, డీఎస్పీలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఏఎస్పీలు 11 మంది, డీఎస్పీలు 24, సీఐలు 78, ఎస్సైలు 132, ఏఎస్ఐ-హెచ్సీలు 303, పీసీలు 568, WPCలు 88, హోంగార్డులు 386, ఉమెన్ హోంగార్డ్స్ 30 మంది విధుల్లో ఉంటారన్నారు.