VIDEO: నిరుపయోగ వాటర్ ట్యాంకు కూల్చివేత
HYD: సంజీవరెడ్డి నగర్‌లో 15 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న 65 ఏళ్ల పాత వాటర్ ట్యాంకును హైడ్రా సురక్షితంగా కూల్చివేసింది. శిథిలావస్థలోని ఈ నిర్మాణం స్థానిక ఇళ్లు, కార్యాలయాలపై పడే ప్రమాదం పొంచి ఉంది. దీంతో జలమండలి విన్నపంతో కేవలం 4 గంటల్లో, భారీ యంత్రాలతో ఎలాంటి నష్టం జరగకుండా ఈ ఆపరేషన్ పూర్తి చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.