చిత్తూరు బస్సు ప్రమాదంపై ఓనర్ స్పందన
CTR: చిత్తూరు బస్సు ప్రమాద వార్తను టీవీలో చూసేనని బస్సు ఓనర్ తెలిపారు. వజ్ర మణి అనే ఏజెంట్ ఐదు రోజుల తీర్థయాత్ర కోసం బస్సును కిరాయికి తీసుకుని 36 మంది ప్రయాణికులు, డ్రైవర్, క్లీనర్‌తో బయలుదేరినట్లు చెప్పారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం బాధకరమని, ప్రమాదం తర్వాత అధికారులు, ఎమ్మెల్యే ఫోన్ చేసి వివరాలు తీసుకున్నారని పేర్కొన్నారు.